బుమ్రా మంచి ఫ్రెండ్ మాత్రమే- అనుపమ

|

Jun 15, 2019 | 5:38 PM

భారత బౌలింగ్ సంచలనం బుమ్రా  వరల్డ్ కప్‌లో అదరగొడుతోన్నాడు. మ్యాజిక్ బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయితే తాజాగా ఈ ఏస్ క్రికెటర్..సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ వార్తలను అనుపమా తాజాగా కొట్టిపారేసింది. ‘బుమ్రా నాకు తెలియదని చెప్పను. అతను నాకు మంచి ఫ్రెండ్. మీరందరూ అనుకుంటున్నట్లు మేం డేటింగ్‌లో లేము. బుమ్రాకి నాకు అలాంటి సంబంధాలు ఉన్నాయని వస్తున్న రూమర్లు […]

బుమ్రా మంచి ఫ్రెండ్ మాత్రమే- అనుపమ
Follow us on

భారత బౌలింగ్ సంచలనం బుమ్రా  వరల్డ్ కప్‌లో అదరగొడుతోన్నాడు. మ్యాజిక్ బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయితే తాజాగా ఈ ఏస్ క్రికెటర్..సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ వార్తలను అనుపమా తాజాగా కొట్టిపారేసింది. ‘బుమ్రా నాకు తెలియదని చెప్పను. అతను నాకు మంచి ఫ్రెండ్. మీరందరూ అనుకుంటున్నట్లు మేం డేటింగ్‌లో లేము. బుమ్రాకి నాకు అలాంటి సంబంధాలు ఉన్నాయని వస్తున్న రూమర్లు ఇప్పటితోనైనా ఆగుతాయని ఆశిస్తున్నా’ అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ప్రేమమ్ సినిమా ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చిన అనుపమ.. దక్షిణ సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి రాక్షసుడు సినిమాలో నటిస్తోంది. తమిళ మాతృక రాట్సన్ నుంచి రీమేక్‌గా సినిమాను చిత్రీకరిస్తున్నారు.