Motivational Story: పెద్దవాడు చిన్నవాడితో పంచుకోవడం ద్వారా ఎలా గొప్పవాడిగా మారవచ్చో అమితాబ్ చెప్పిన కథ..నెట్టింట్లో వీడియో వైరల్

|

Oct 02, 2022 | 7:55 PM

బాలీవుడ్ సీనియర్ నటుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  కౌన్ బనేగా కరోర్ పతి షో లో  చెప్పిన కథ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో బిగ్ బీ  మీ జీవితంలో లోతైన ముద్ర వేసే కథను చెప్పారు.

Motivational Story: పెద్దవాడు చిన్నవాడితో పంచుకోవడం ద్వారా ఎలా గొప్పవాడిగా మారవచ్చో అమితాబ్ చెప్పిన కథ..నెట్టింట్లో వీడియో వైరల్
Amitabh Bachchan
Follow us on

వివిధ రకాల విషయాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో చాలా విషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. అదే సమయంలో  మీరు జీవితంలో ఏ పుస్తకం ఇవ్వలేని జ్ఞానాన్ని ఇచ్చేవి కూడా ఉంటాయి. కొన్ని అనుభవాల నుంచి చెప్పే విషయాలు ఏ చదువులు, పుస్తకాలు అందించవు.. అటువంటి గొప్ప అనుభవాన్ని జీవిత సారాన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విషయాల నుంచి కూడా పొందుతాము. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో  చర్చనీయాంశమైంది. దీనిని ఐఏఎస్ అధికారి షేర్ చేశారు. అది చూసిన తర్వాత ఎవరికైనా ఒక జీవితానికి సంబదించిన అనుభవం అర్ధమయింది అని అనుకుంటారు. జీవితంలో పెద్దతనం అంటే తన కంటే చిన్నోళ్లను శాసించడం కాదు.. తనకంటే చిన్నవారిని తనకంటే పెద్దదిగా చేసేదే పెద్దతనం పేర్కొన్నారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  కౌన్ బనేగా కరోర్ పతి షో లో  చెప్పిన కథ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో బిగ్ బీ  మీ జీవితంలో లోతైన ముద్ర వేసే కథను చెప్పారు. ఒక స్కూల్ లో మొదటి రోజు.. 9 వ అంకె 8వ అంకెను కొట్టింది. అప్పుడు 8వ అనేక ఏడుస్తూ నన్ను ఎందుకు కొట్టావని అడిగితే.. నువ్వు నాకంటే చిన్న అందుకే కొట్టా అని తొమ్మిది సమాధానం చెప్పింది. దీంతో 8వ అంకె తనకంటే చిన్నదైన 7 వ అంకెను కొట్టింది.. ఇలా తన కంటే చిన్న అంకెను కొట్టడం ఒకటి ఒకటి వరకూ సాగింది. ఒకటి వంతు వచ్చింది.. అప్పుడు సున్నా తన వంతు వచ్చింది.. అనుకుంటూ భయంతో పక్కకు వెళ్ళింది.. అప్పుడు ఒకటి భయపడకు నేను కొట్టను అంటూ సున్నాదగ్గరకు వెళ్లి కూర్చుంది. అప్పుడు ఒకటి సున్నా కలిసి 10 సంఖ్య అయింది.. విలువ పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ కథ నుండి మనకు లభించే పాఠం ఏమిటంటే.. పెద్దవాడు ఎప్పుడూ తనకంటే చిన్నవాడిని తక్కువ చూడడు.. అతనిని దోపిడీ చేయడు. ఈ వీడియోను IAS అధికారి అవనీష్ శరణ్ పంచుకున్నారు. అనేక మంది నెటిజన్లు ఈ వీడియోను ఇష్టపడ్డారు. తొమ్మిది లక్షల మంది కంటే ఎక్కువ మంది వీడియోను చూశారు.

కొంతమంది తమ విద్య, కళ, పరిశ్రమ మొదలైన వాటి ద్వారా ప్రజలకు పని కల్పించి, వారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. తద్వారా ప్రజలు వాటి నుంచి పనులు నేర్చుకుని, తాము అభివృద్ధి చెందుతారు. ఇతరులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇది జీవితం.  జీవిత ప్రయోజనం కూడా! ఇది మానవ జీవితంలోనే సాధ్యం! తనకోసం బ్రతకడం పశుత్వం.. తాను బతుకుతూ.. నలుగురు బతికేలా  ఆధారాన్ని కల్పించడం దైవత్వం.

సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియో నిజంగా నా రోజును అద్భుతంగా మార్చిందని మరొక వినియోగదారు రాశారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..