మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కి ఆలస్యమవుతుంది. అయితే ఈ చిత్రంలో రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్రను తెలుగులో విజయ దేవరకొండ చేయనున్నాడట. ఇక మరోవైపు ఇదే పాత్రకు జగపతి బాబు పేరు కూడా వినిపిస్తోంది. మరి చివరికి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనేది అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఫైటర్‌లో నటిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ షూటింగ్.. కోవిడ్ అదుపులోకి వచ్చిన తరువాతనే మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు.
Read More:
ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత