నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ థియేటర్స్ యజమానులు.. థియేటర్లు మూసివేస్తామంటూ..

|

Feb 03, 2021 | 9:38 PM

కరోనా ప్ర‌భావం నుంచి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో కేంద్ర ప్ర‌భుత్వం యాబై శాతం సీటింగ్ కెపాసిటీకి

నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ థియేటర్స్ యజమానులు.. థియేటర్లు మూసివేస్తామంటూ..
theaters
Follow us on

కరోనా ప్ర‌భావం నుంచి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సినీ ప‌రిశ్ర‌మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో కేంద్ర ప్ర‌భుత్వం యాబై శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఈ విషయం నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు ఇబ్బందిగా మారిపోయింది. ఇక థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాటిసీ ఉన్నా కానీ.. అటు భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇటీవల థియేటర్లలో విడుదలైన క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ వంటి సినిమాలు సూపర్ హిట్ సాధించి అటు నిర్మాతలలో కాస్తా ఆశలు రేకెత్తించాయి. ఈ సినిమాల ప్రభావంతో మిగతా చిత్రాల షూటింగ్స్ శరవేగంగా పూర్తిచేసుకుని సమ్మర్లో వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఇటీవల అగ్రహీరోల సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు దాదాపు అందరూ తమ తమ సినిమా విడుదల తేదీలను ప్రకటించేసారు. ఇందులో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు, అగ్రహీరోల సినిమాలు సమ్మర్లోనే థియేటర్లలోకి రానున్నాయి.

ఇదిలా ఉండగా.. కరోనా తర్వాత స్పీడ్ పెంచిన నిర్మాతలకు తెలంగాణ థియేటర్ల యజమానులు షాక్ ఇచ్చారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ పద్ధతిలో పర్సెంటేజ్ విధానానికి నిర్మాతలు అంగీకరించాలని థియేటర్స్ యజమానులు కోరారు. ఈ మేరకు బుదవారం రాష్ట్రంలోని సినిమా థియేటర్స్ యజమానులు, నిర్మాతలతో సమావేశమయ్యారు. థియేటర్లలో విడుదల చేసిన సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి గ్యాప్ ఉండాలని తెలిపారు. అందులో పెద్ద సినిమాలకు ఆరు వారాల గ్యాప్.. చిన్న సినిమాలకు నాలుగు వారాల గ్యాప్ ఉండాలని తెలిపారు. ఈ డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించాలని.. లేకపోతే మార్చి 1 నుంచి తెలంగాణలో థియేటర్లు మూసివేస్తామని చెప్పారు.

Also Title:

మెగా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లు.. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలు.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే ?