మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ హీరో.. పొలిటికల్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్.. టైటిల్ ఎంటంటే..
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టర్ అనుభవ్ సిన్హా కాంబోలో వచ్చిన 'ఆర్టికల్ 15' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీ విమర్శకుల నుంచి
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, డైరెక్టర్ అనుభవ్ సిన్హా కాంబోలో వచ్చిన ‘ఆర్టికల్ 15’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. తాజాగా వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సినిమాకు ‘అనేక్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా హీరో ఆయుష్మాన్ తన ట్విట్టర్లో షేర్ చేసాడు.
అనుభవ్ సార్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా లుక్ ఇదిగో అంటూ ఈ మూవీలో తాను నటించే జోష్వా లుక్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. టి.సిరీస్ భూషణ్ కుమార్, అనుభవ్ సిన్హా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారపు. ప్రస్తుతం ఆయుష్మాన్ ‘డాక్టర్ జీ’తోపాటు ‘చండీఘర్ కరే ఆషికీ’ సినిమాల్లో నటిస్తున్నాడు.
Also Read:
మెగా ఎఫెక్ట్.. వరుస ఆఫర్లు.. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలు.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే ?