డ్రగ్స్ కేసులో నటీనటులకు క్లీన్‌చిట్ ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకా ఎవ్వరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, ఇందులో సంబంధం ఉన్న ఎవరినీ వదలిపెట్టమని అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో మొత్తం 7 చార్జ్‌షీట్లు దాఖలు చేశామని.. ఇంకా ఐదు దాఖలు చేయాల్సి ఉందని వారు తెలిపారు. సినీ నటుల వ్యవహరాంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వచ్చిందని.. త్వరలోనే మిగతా చార్జ్‌షీట్లు దాఖలు చేస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖపై ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారు అన్నారు. కాగా సంచనలం రేపిన డ్రగ్స్ కేసులో సినీ నటులకు క్లీన్‌చిట్ వచ్చిందంటూ మంగళవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.