‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను నిలిపివేయాలంటూ ఈసీకి టీడీపీ వినతి

|

Mar 15, 2019 | 12:33 PM

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి గురువారం టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అన్నం సతీష్‌ ప్రభాకర్‌, తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ, శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష తదితరులు సచివాలయంలో ద్వివేదిని కలిశారు. కాగా దర్శకుడు వర్మ […]

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను నిలిపివేయాలంటూ ఈసీకి టీడీపీ వినతి
Follow us on

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి గురువారం టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అన్నం సతీష్‌ ప్రభాకర్‌, తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ, శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష తదితరులు సచివాలయంలో ద్వివేదిని కలిశారు. కాగా దర్శకుడు వర్మ మాత్రం.. నేను చనిపోయినా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రం రిలీజ్ చేస్తానని ఢంకాపథంగా చెప్తున్నారు. సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వకపోతే యూ ట్యూబ్‌లో రిలీజ్ చేస్తానంటూ మెండిపట్టు పట్టారు.