లాక్‌డౌన్‌ సడలింపులు.. ఖుషీలో కోలీవుడ్..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు నిదానంగా సడలింపులు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రంగాలకు సడలింపులు లభించాయి. ఇక సినీ రంగానికి కూడా దేశవ్యాప్తంగా త్వరలోనే సడలింపులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమకి ఆ రాష్ట్ర సర్కార్‌ ఊరట ఇచ్చింది. మే 11 తేదీ నుండి సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో తమిళ సర్కార్‌కి సినీ […]

లాక్‌డౌన్‌ సడలింపులు.. ఖుషీలో కోలీవుడ్..!

Edited By:

Updated on: May 08, 2020 | 6:43 PM

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు నిదానంగా సడలింపులు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రంగాలకు సడలింపులు లభించాయి. ఇక సినీ రంగానికి కూడా దేశవ్యాప్తంగా త్వరలోనే సడలింపులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమకి ఆ రాష్ట్ర సర్కార్‌ ఊరట ఇచ్చింది. మే 11 తేదీ నుండి సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో తమిళ సర్కార్‌కి సినీ ప్రముఖులు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా కరోనా మహమ్మారి లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా 50 రోజులపాటు దేశంలోని అన్ని సినీ పరిశ్రమల షూటింగ్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జూన్ లేదా జూలై నుంచి సినిమా చిత్రీకరణలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: మానస్‌ సరోవర్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న ప్రయాణం