Tamil Actress Ovia Helen : ఆ నటిపై దేశద్రోహం కేసు పెట్టాలి.. బీజేపీ నాయకుల డిమాండ్.. ఎందుకో తెలుసా..

|

Feb 15, 2021 | 8:00 PM

Tamil Actress Ovia Helen : తమిళ నటి ఒవియా హెలెన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి మోదీ తమిళనాడులో పర్యటించి

Tamil Actress Ovia Helen : ఆ నటిపై దేశద్రోహం కేసు పెట్టాలి.. బీజేపీ నాయకుల డిమాండ్.. ఎందుకో తెలుసా..
Follow us on

Tamil Actress Ovia Helen : తమిళ నటి ఒవియా హెలెన్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి మోదీ తమిళనాడులో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సోషల్ మీడియాలో ‘మోడీ గో బ్యాక్’ నినాదాలతో ట్రెండ్‌కు తెరతీశారు. ఈ క్రమంలో ఒవియా కూడా ‘మోడీ గో బ్యాక్’ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తూ ట్వీట్ చేసింది.

దీంతో తమిళనాడు బీజేపీ నాయకులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. తన ట్వీట్ వెనుక కుట్ర దాగి ఉందని, లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరుతున్నారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1తో ఫేమస్ అయిన ఈ కేరళ భామ తమిళ్‌లో హీరోయిన్‌గా చేసింది. తెలుగులోనూ హీరో తరుణ్‌తో కలిసి ‘నా లవ్ స్టోరీ’ అనే చిత్రంలో నటించింది.

KAKINADA MURDER: కాకినాడ కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు..