టైటిల్ మార్చుకున్న తమిళ ‘అర్జున్ రెడ్డి’

| Edited By:

Feb 20, 2019 | 9:58 AM

కొన్ని కారణాల వలన బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ బాలా విడుదల అవ్వకుండానే ఆగిపోగా.. హీరో మినహా కొత్త టీమ్‌తో సినిమా మొత్తాన్ని మరోసారి షూటింగ్ చేయిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను కూడా మార్చేశారు. ‘అదిత్య వర్మ’ అనే టైటిల్‌తో అర్జున్ రెడ్డి రీమేక్ రీ షూటింగ్ జరుపుకుంటుండగా.. గిరీషయ్య(తెలుగు అర్జున్ రెడ్డి అసిస్టెంట్) దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ […]

టైటిల్ మార్చుకున్న తమిళ ‘అర్జున్ రెడ్డి’
Follow us on

కొన్ని కారణాల వలన బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ బాలా విడుదల అవ్వకుండానే ఆగిపోగా.. హీరో మినహా కొత్త టీమ్‌తో సినిమా మొత్తాన్ని మరోసారి షూటింగ్ చేయిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను కూడా మార్చేశారు. ‘అదిత్య వర్మ’ అనే టైటిల్‌తో అర్జున్ రెడ్డి రీమేక్ రీ షూటింగ్ జరుపుకుంటుండగా.. గిరీషయ్య(తెలుగు అర్జున్ రెడ్డి అసిస్టెంట్) దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలో ధృవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ బానితా సంధు హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియా ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. E4 ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతం అందిస్తున్నాడు.