Tollywood : ఆమెది పాలలాంటి శరీరం.. నటుడి కామెంట్స్.. ఏడాది తర్వాత కౌంటరిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ తన శరీరాకృతిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఘాటుగా స్పందించారు. ఇలాంటి నెగిటివ్ విషయాలను తాను పట్టించుకోనని, వాటిని వడపోసి తన పనిపైనే దృష్టి సారిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఏడాది తర్వాత ఆమె ఈ వివాదంపై మౌనం వీడారు. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tollywood : ఆమెది పాలలాంటి శరీరం.. నటుడి కామెంట్స్.. ఏడాది తర్వాత కౌంటరిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..
Tamanna

Updated on: Oct 30, 2026 | 9:35 PM

సినిమా పరిశ్రమలో నటీనటుల శరీరాకృతి లేదా వారి గ్లామర్ గురించి కొందరు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ నటులు లేదా సహనటులు కొందరు పబ్లిక్‌గా చేసే కామెంట్లు కొన్నిసార్లు తీవ్ర వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ గతంలో తన శరీరంపై చేసిన వివాదాస్పద హీరోయిన్ ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా భాటియాఎట్టకేలకు స్పందించారు. కొన్ని రోజుల క్రితం అను కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా అందం , శరీరాకృతిని ఉద్దేశించి కొన్ని అసంబద్ధమైన, చులకన చేసే రీతిలో ఆమెది పాలలాంటి శరీరం అంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న తమన్నా, తాజాగా ఒక మీడియా సమావేశంలో ఈ వివాదంపై తనదైన శైలిలో కౌంటరిచ్చారు. మహిళల శరీరంపై ఇతరులు పబ్లిక్‌గా కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తోటి నటుల నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని, ఇతరుల ప్రైవసీని , గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని ఆమె హితవు పలికారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

అలాగే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ను తాను ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. ఇలాంటి వాటిని వడపోసి తన పనిపైనే దృష్టిపెడతానని స్పష్టం చేశారు. మనం ఏది పట్టించుకోవాలి.. ఏది వదిలేయాలి అనే విషయంపై క్లారిటీ ఉండాలి. ఒక మహిళగా మనం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో ముందుకు సాగలేం. నేను నా పని మీదనే దృష్టి పెడతా. ఏం చేయాలనుకుంటున్నానో దానిపైనే ఫోకస్ చేస్తా అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

అసలు విషయానికి వస్తే.. 2025లో స్త్రీ 2 చిత్రంలో ఆజ్ కీ రాత్ అనే స్పెషల్ పాటలో తమన్నా కనిపించింది. ఈ పాట గురించి అన్నూ కపూర్ మాట్లాడుతూ ఆమె పాలలాంటి ముఖం, శరీరం, పిల్లలు హాయిగా నిద్రపోవడానికి సాయపడతాయని అని అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

తమన్నా..

Tamanna New

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Loading...
Unable to load recommendations.
Follow Us