Tamanna – Samantha: ఆధ్యాత్మిక మార్గంలో గ్లామర్ క్వీన్స్‌.. లేటెస్ట్ ఎంట్రీ ఎవరంటే..?

|

Jul 08, 2022 | 6:21 PM

తెర మీద గ్లామర్‌ షోతో అదరగొట్టే హీరోయిన్‌లు తెర వెనుక మాత్రం డిఫరెంట్ పాత్‌ను ఎంచుకుంటున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. ఆధ్యాత్మికం వైపు కూడా సీరీయిస్‌గా ఫోకస్ చేస్తున్నారు.

Tamanna - Samantha: ఆధ్యాత్మిక మార్గంలో గ్లామర్ క్వీన్స్‌.. లేటెస్ట్ ఎంట్రీ ఎవరంటే..?
Tamanna Samantha Amala Paul
Image Credit source: TV9 Telugu
Follow us on

తెర మీద గ్లామర్‌ షోతో అదరగొట్టే హీరోయిన్‌లు తెర వెనుక మాత్రం డిఫరెంట్ పాత్‌ను ఎంచుకుంటున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. ఆధ్యాత్మికం వైపు కూడా సీరీయిస్‌గా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna) కూడా ఈ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ హీరోయిన్ ట్యాగ్ యాడ్ అయినా ఇంకా కమర్షియల్ హీరోయిన్‌గానే కంటిన్యూ అవుతున్నారు తమన్నా. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌, డిజిటల్ ప్రయోగాలతో పాటు గ్లామర్ షోకు స్కోప్‌ ఉన్న హీరోయిన్‌ రోల్స్‌ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అదే టైమ్‌లో తనలోని మరో కోణాన్ని బయట పెట్టారు మిల్కీ బ్యూటీ. ఇంత బిజీ షెడ్యూల్స్‌ మధ్య 41 రోజుల పాటు యోగా సాధన కోసం సమయం కేటాయించారు. ఈ మధ్య కాలంలో యోగా, మెడిటేషన్, స్పిర్చువాలిటీ వైపు తమన్నా ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా తన స్పిరిచ్యువల్‌ ఐడియాలజీ గురించి హింట్ ఇచ్చారు. రెగ్యులర్‌గా ఈషా కార్యక్రమాల్లో కనిపించే సామ్.. ఫ్రెండ్స్‌తో టెంపుల్‌ టూర్స్‌ కూడా బాగానే చేస్తుంటారు. తన ఫిజికల్‌ అండ్‌ మెంటల్‌ ఫిట్‌నెస్‌కు కారణం స్పిరిచ్యువాలిటీ అండ్‌ యోగానే అన్నది సామ్ చెబుతున్న మాట.

తెర మీదే కాదు సోషల్ మీడయాలో కూడా తన గ్లామర్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసే అమలా పాల్‌ (Amala Paul) కూడా తనలోని మరో క్యారెక్టర్‌ గురించి ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. లైఫ్‌లో బిగ్ చేంజెస్‌ను ఫేస్ చేసిన ఈ బ్యూటీ స్ట్రగుల్‌ టైమ్‌లో స్పిరిచ్యుయాలిటికీ ఎక్కువ టైమ్ కేటాయించారు. ఇప్పుడు అదే అలవాటుగా మరి రెగ్యులర్‌గా యోగ సాధన చేస్తున్నారు. ఆ విషయాన్ని ఫ్యాన్స్‌తోనూ రెగ్యులర్‌గా షేర్ చేసుకుంటున్నారు. ఇలా హాట్ బ్యూటీస్‌ స్పిరిచ్యుయల్‌ పాత్‌ తీసుకోవటం ఇంట్రస్టింగ్‌ అంటున్నారు క్రిటిక్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి..