స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం వల్ల.. అక్టోబర్ 2వ తేదీకి సినిమా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయడాన్ని దర్శక నిర్మాతలు దాదాపు ఖరారు చేశారట. నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.