Mahesh Babu: మహేశ్‌బాబు నెక్స్ట్ సినిమాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరితో చేస్తారో..

|

Jan 18, 2021 | 10:39 AM

Mahesh Babu: టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. ఆయన పేరు చెబితే చాలు అభిమానులు పులకరించిపోతారు.

Mahesh Babu: మహేశ్‌బాబు నెక్స్ట్ సినిమాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరితో చేస్తారో..
Follow us on

Mahesh Babu: టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. ఆయన పేరు చెబితే చాలు అభిమానులు పులకరించిపోతారు. విభిన్న శైలిలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ తన ఉదారతను కూడా చాటుతుంటారు. ఇటీవల వచ్చిన సినిమాలతో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా మారిపోయారు. చాలా తక్కువ సినిమాలతో ఎక్కువ పాప్‌లారిటీ సంపాదించిన ఏకైక హీరో మహేశ్ అని చెప్పవచ్చు. అయితే ఆయన తర్వాత ప్రాజెక్ట్‌పై అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే దర్శకుడు పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ అనే మరో మాస్ ఫ్లిక్‌ను లైన్‌లో పెట్టారు. ఇక దీని తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ దానిని మొదలు పెట్టే లోపు మరో చిత్రాన్ని మహేష్ చేసేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అది ఎవరితో చేస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ రేస్ లో చాలా మంది టాప్ దర్శకుల పేర్లే వినిపిస్తున్నా ఫైనలైజ్ లిస్ట్ మాత్రం ఇద్దరు దర్శకుల పేర్లే వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి వంశీ పైడిపల్లి కాగా మరొకటి కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్. మరి ఫైనల్ గా ఫిల్టర్ కాబడ్డ ఈ ఇద్దరిలో మహేష్ ఎవరితో సినిమా చేస్తారో అన్నది మరింత ఉత్కంఠగా మారింది.

ఉదయం 3 గంటల సమయంలో ఇంత అందంగా ఎవరు ఉంటారు.. మహేష్‌ ఫొటో షేర్ చేసిన నమ్రత