క్రేజీ కాంబోలో ఆరో సినిమా ఆగిపోయిందా!

కోలీవుడ్‌లో సూర్య- హరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ కాంబోలో ఇప్పటివరకు ఐదు చిత్రాలు తెరకెక్కగా, అవన్నీ మంచి విజయాలను సాధించాయి

క్రేజీ కాంబోలో ఆరో సినిమా ఆగిపోయిందా!

Edited By:

Updated on: Aug 09, 2020 | 1:34 PM

Suriya- Hari movie shelved: కోలీవుడ్‌లో సూర్య- హరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ కాంబోలో ఇప్పటివరకు ఐదు చిత్రాలు తెరకెక్కగా, అవన్నీ మంచి విజయాలను సాధించాయి. ఇక ఆరోసారి కూడా ఈ కాంబోలో సినిమా రాబోతున్నట్లు ఆ మధ్యన అధికారిక ప్రకటన వెలువడింది. స్టూడియో గ్రీన్ నిర్మించబోయే ఈ చిత్రానికి ‘అరువ’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. అంతేకాదు హీరోయిన్‌గా రాశి ఖన్నా, సంగీత దర్శకుడిగా డి.ఇమ్మన్‌ ఫిక్స్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. కారణాలు తెలీవు గానీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతం ఆపేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సూర్య తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో‌ గానీ పాండిరాజ్‌తో గానీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హరి, అరుణ్ విజయ్‌తో మూవీ తీయబోతున్నట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read This Story Also: ఆ దిశగా పరిశోధనలు చేస్తే కరోనాను నాశనం చేయొచ్చు