క్రేజీ కాంబో: త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య!

| Edited By:

Aug 06, 2020 | 2:09 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, తమిళ స్టార్ నటుడు సూర్య.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందా..! అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి.

క్రేజీ కాంబో: త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య!
Follow us on

Trivikram to direct Suriya: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, తమిళ స్టార్ నటుడు సూర్య.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందా..! అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ కథను రెడీ చేసిన త్రివిక్రమ్‌ దాన్ని సూర్యకు వినిపించడం, ఆ కథ ఆ నటుడికి బాగా నచ్చేయడం, దీంతో మాటల మాంత్రికుడికి సూర్య ఓకే చెప్పేయడం జరిగిందని ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కాగా సుధ కొంకర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తరువాత దర్శకులు హరి, వెట్రిమారన్‌లకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశారు సూర్య. ఆయా సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ రెండు చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య నటించబోతున్నట్లు వార్తలు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు పుకార్లు వచ్చాయి. మరి ఈసారైనా ఈ కాంబో సెట్‌ అవుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఈ ఏడాది అల వైకుంఠపురములో సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న త్రివిక్రమ్‌, త్వరలో ఎన్టీఆర్‌తో ఓ సినిమాను చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టనుంది.

Read This Story Also: మరో నటుడు ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం