Suresh Raina Biopic: తెర‌పైకి సురేష్ రైనా బ‌యోపిక్‌.. లీడ్ రోల్‌లో న‌టించేదెవ‌రు.. రైనా అభిప్రాయం ఏంటి.?

Suresh Raina Biopic: ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. సినీ తార‌ల నుంచి క్రీడాకారుల వ‌ర‌కు వారి జీవ‌త క‌థ ఆధారంగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. ప్రేక్ష‌కులు కూడా తాము అభిమానించే వ్య‌క్తుల బ‌యోపిక్‌ల‌ను...

Suresh Raina Biopic: తెర‌పైకి సురేష్ రైనా బ‌యోపిక్‌.. లీడ్ రోల్‌లో న‌టించేదెవ‌రు.. రైనా అభిప్రాయం ఏంటి.?
Suresh Raina Biopic

Updated on: Jun 25, 2021 | 10:39 PM

Suresh Raina Biopic: ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌ల హ‌వా న‌డుస్తోంది. సినీ తార‌ల నుంచి క్రీడాకారుల వ‌ర‌కు వారి జీవ‌త క‌థ ఆధారంగా సినిమాలు తెర‌కెక్కిస్తున్నారు. ప్రేక్ష‌కులు కూడా తాము అభిమానించే వ్య‌క్తుల బ‌యోపిక్‌ల‌ను చూడ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సైతం బ‌యోపిక్‌ల‌ను తెర‌కెక్కించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ధోనీతో పాటు పలువురు క్రికెట‌ర్లు, ఇత‌ర ఆట‌గాళ్ల బ‌యోపిక్‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి సురేష్ రైనా కూడా వ‌చ్చి చేరినట్లు తెలుస్తోంది.
త‌న అస‌మాన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజ‌యాల‌ను అందించిన సురేష్ రైనా బ‌యోపిక్ తెర‌కెక్కించే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే టైటిల్ రోల్‌లో ఎవ‌రు న‌టిస్తార్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక‌ ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సురేష్ రైనా.. త‌న బ‌యోపిక్‌లో సౌత్ స్టార్ హీరోలైనా సూర్య లేదా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తే స‌రిగ్గా స‌రిపోతార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉంటే సురేష్ రైనా త‌న క్రికెట్ కెరీర్‌కు 2020 ఆగ‌స్టు 15న రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Also Read: Pooja Hegde Rashmika Mandanna: అమ్మో.. ఈ నాయిక‌ల స్ట్రాట‌జీలు మాములుగా లేవు.. ప‌క్కా ప్లానింగ్

Megastar Chiranjeevi: నైన్టీస్‌లోనే బాలీవుడ్ మేగజైన్‌ కవర్‌పేజ్ ఎక్కేశారు.. ఆయ‌న‌కు పాన్ ఇండియా ఇమేజ్ ఓ లెక్కా..?

RGV: మ‌రో హారర్‌ మూవీ చేయ‌నున్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.. అగ్ర హీరోతో భ‌య‌పెట్టించ‌నున్న వ‌ర్మ‌..