Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

దివంగత నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలోని భువనగిరిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆమె తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని మరణించింది.

Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..
Pratyusha

Updated on: Feb 17, 2026 | 12:01 PM

సినీనటి ప్రత్యూష కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. దివంగత హీరోయిన్ ప్రత్యూష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని భువనగిరిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 1998లో విడుదలైన రాయుడు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో కీలకపాత్రలో నటించింది. తెలుగులో స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అప్పుడప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న ప్రత్యూష.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి 2002 ఫిబ్రవరి 23న ఆత్మహత్యయత్నం చేసింది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఈ ప్రయత్నంలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. అయితే సిద్ధార్థ రెడ్డి వల్లే తన కూతురు మరణించింది అని ఆరోపిస్తూ ప్రత్యూష తల్లి సరోజిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. ఆయనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 24 సంవత్సరాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నాంపల్లిలోని స్థానిక కోర్టు సిద్ధార్థ్ రెడ్డికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ 2011లో హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50,000కి పెంచింది. అయితే ఈ తీర్పుతో తన కూతురికి న్యాయం జరగలేదంటూ ఆమె తల్లి సరోజిని 2012లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

గత ఏడాది నవంబర్ లో సిద్ధార్థ రెడ్డి తనపై వేసిన జైలు శిక్షణను సవాల్ చేస్తూ అప్పీల్ చేయగా.. అతడి శిక్షణ పెంచాలి అంటూ ప్రత్యూష తల్లి సరోజినీ వేసిన పిటిషన్ల పై గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. మంగళవారం ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

Follow Us