మరోసారి అస్వస్థతకు గురైన సూపర్ స్టార్… ఆందోళన చెందుతున్నరజినీకాంత్ అభిమానులు..

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

మరోసారి అస్వస్థతకు గురైన సూపర్ స్టార్... ఆందోళన చెందుతున్నరజినీకాంత్ అభిమానులు..

Updated on: Dec 25, 2020 | 7:02 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హైబీపీ కారణంగా ఆయన ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పరీక్షలు చేయగా ఆయనకు కరోనా నెగిటివ్ అని తేలింది. అప్పట్నుంచి హోమ్ ఐపోలేషన్‌లో ఉంటోన్న రజని నేడు అస్వస్థతకు గురవ్వడంతో.. హైదారాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతంలో పలు సార్లు రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారుఒక్కసారి ఆయన హెల్త్ ట్రాక్ చూసుకున్నటైతే..

2011 లో రజనీకాంత్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో రజనీ వయస్సు 61 ఏళ్ళు.  ఏప్రిల్ 29 న ఏవిఎం స్థూడియో లో ‘రాణా ‘చిత్రం పూజా కార్యక్రమం జరిగింది. అదే రోజు సాయంత్రం ఇసబెల్లా హాస్పిటల్ లో చేరారు సూపర్ స్టార్. అనంతరం అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఆతర్వాత మళ్లీ మే3 న ఇసబెల్లా లో అడ్మిట్ అయ్యారు. మే 13 న అక్కడి నుంచి పోరూరు లోని రామచంద్ర హాస్పిటల్ కు తరలించారు. మే 13 నుంచి 28 వరకు అక్కడే చికిత్సను అందించారు. దాంతో ‘రాణా’ చిత్రం నిలిచిపోయింది. ఆతర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్… నిమ్మోనియా… అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. ఆసమయంలో మే 28 సింగపూర్ కు తరలించారు. సింగపూర్ లో మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో చికిత్స అందించారు. ఆసమయంలో రజినీకి కిడ్నీ మార్పిడి జరిగింది. ఆతర్వాత జూన్ 15 న తిరిగి చెన్నైకి వచ్చారు రజనీ…

ఆతర్వాత 2016 లో రజినీకాంత్ కు మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆసమయంలో అమెరికా లో చికిత్సపొందారు సూపర్ స్టార్ అప్పుడు ఆయన వయస్సు 65 సంవత్సరాలు.  మళ్లీ 2018 ఏప్రిల్ లో  చెకప్ ల కోసం అమెరికా  వెళ్లారు. మరో వైపు రెండు నెలల క్రితం రజనీ ఆరోగ్యం పై వైద్యుల పలు జాగ్రత్తలు సూచించారు. ఆరోగ్యదృష్ట్యా.. రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 71 సంవత్సరాలు. ప్రస్తుతం హైదరాబాద్ అపోలోలో చేరిన రజనీకాంత్ కు వైద్యలు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆయన ఆరోగ్యపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలగడగా ఉందని వైద్యులు తెలిపారు.