Mahesh Babu: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మహేష్ ఏం జరుగుతోంది..!

| Edited By:

Feb 24, 2020 | 10:02 PM

సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ వర్రీ అవుతున్నారట. తమ హీరోకు ఏమైంది..? అసలు ఏం జరుగుతోంది..? మహేష్ మూవీల గురించి ఈ షాకింగ్ న్యూస్‌లు ఏంటి..? అంటూ వారు ఆలోచిస్తున్నారట. ఇక అసలు విషయంలోకొస్తే., మహేష్, వంశీ పైడిపల్లి చిత్రం ఆగిపోయిందన్న

Mahesh Babu: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మహేష్ ఏం జరుగుతోంది..!
Follow us on

సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ వర్రీ అవుతున్నారట. తమ హీరోకు ఏమైంది..? అసలు ఏం జరుగుతోంది..? మహేష్ మూవీల గురించి ఈ షాకింగ్ న్యూస్‌లు ఏంటి..? అంటూ వారు ఆలోచిస్తున్నారట. ఇక అసలు విషయంలోకొస్తే., మహేష్, వంశీ పైడిపల్లి చిత్రం ఆగిపోయిందన్న పుకార్లు ఇటీవల చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఇంకా స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో మరో దర్శకుడితో సెట్స్ మీదకు వెళ్లాలని మహేష్ భావిస్తున్నారట. ఈ క్రమంలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే పరశురామ్, మహేష్‌కు కథ చెప్పారని.. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నటించేందుకు కూడా మహేష్ రెడీగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే అధికారిక ప్రకటన వచ్చిన తరువాత మహేష్ మూవీ ఆగిపోవడం ఇది తొలిసారేం కాదు. గతంలో భరత్ అనే నేను సినిమా సమయంలోనే సుకుమార్‌తో తదుపరి చిత్రాన్ని ప్రకటించారు మహేష్. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. దానిపై అప్పట్లో ఎన్నో రూమర్లు వచ్చాయి. సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్‌కు నచ్చలేదని.. సుకుమార్ కథను చెప్పినా, మహేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని.. తనతో సినిమాను ప్రకటించిన తరువాత మరో దర్శకుడిని మహేష్ కలవడం సుకుమార్‌ను బాధించిందని, దానికి చిన్నబుచ్చుకొని ఆయనే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారని.. ఇలా పలు రకాల వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందన్న తరువాత మహేష్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. సుకుమార్‌తో సినిమా అంటే టాలీవుడ్‌లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఆయనతో తమ హీరో సినిమా ఆగిపోవడం వారు చాలా రోజులు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైంది. పరశురామ్‌ ఇంతవరకు స్టార్ హీరోలతో పనిచేయలేదు. ఆయనకు అవకాశం ఇవ్వడం కంటే.. వంశీకే ఇస్తే బావుంటుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వంశీ ఇదివరకు మహేష్ బాబుతో మహర్షి చిత్రం తీశారు. క్రిటిక్స్ పరంగానే కాదు.. కమర్షియల్‌గా ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. అందుకే మహేష్‌కు వంశీ కరెక్ట్ అని వారు అనుకుంటున్నారట. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వారిని కాస్త అసహనానికి గురి చేసినట్లు టాక్. ఇప్పటికైనా తమ అభిప్రాయాలు, తమ అభిమాన నటుడికి తెలిసేలా ఓ వ్యక్తి మధ్యలో ఉండటం మంచిదని ఫ్యాన్స్ భావిస్తున్నారట.