అమ్మకి డ్యాన్స్ అంటే ఇష్టం .. స్కూల్ డేస్‌లో డ్యాన్స్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేమస్ యాంకర్

|

Feb 16, 2021 | 5:42 PM

సెలబ్రెటీకైనా చిన్నతనంలో దిగిన ఫోటోలను చూసుకుంటుంటే అదో ఆనందం.. తమకు నచ్చిన మెచ్చిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటారు.. అలా తాజాగా బుల్లితెరపై ఫేమస్ యాంకర్ తాను చిన్నతనంలో డ్యాన్స్ చేస్తూ..

అమ్మకి డ్యాన్స్ అంటే ఇష్టం .. స్కూల్ డేస్‌లో డ్యాన్స్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేమస్ యాంకర్
Follow us on

సెలబ్రెటీకైనా చిన్నతనంలో దిగిన ఫోటోలను చూసుకుంటుంటే అదో ఆనందం.. తమకు నచ్చిన మెచ్చిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటారు.. అలా తాజాగా బుల్లితెరపై ఫేమస్ యాంకర్ తాను చిన్నతనంలో డ్యాన్స్ చేస్తూ దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఆ యాంకర్ ఎవరో గుర్తు పట్టే ప్రయత్నం చేయండి..

ఫోటోను జాగ్రత్తగా పట్టి పట్టి చుస్తే.. వెంటనే ఆ యాంకర్ ఎవరో గుర్తు కొచ్చేస్తుంది. ఆమె ఎవరో కాదు గత కొన్నేళ్లుగా బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ కనకాల. గలగలా మాట్లాడుతూ.. తన మాటల గారడితో ప్రేక్షకుల మనసులను దోచినుకున్న సుమ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే యాంకర్, వ్యాఖ్యాత,, నిర్మాత, సుమ కనకాల మల్టీటాలెంటెడ్ పర్సన్.

ఇలాంటి యాంకర్ మళ్ళీ తెలుగు బుల్లి తెరపై చూస్తామా అనే రీతిలో సుమ ఫేమ్ సంపాదించుకుంది. సుమతో పాటు వచ్చిన యాంకర్స్ కనుమరుగయ్యారు.. వాస్తవానికి సుమ బుల్లి తెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది.. కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడు లో ఎంట్రీ ఇచ్చింది.

బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటి టాప్ యాంకర్.. తాను చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్, సంగీతం నేర్చుకున్నానని సుమ చాలా సార్లు ప్రేక్షకులతో తన చిన్నతనం రోజులను పంచుకుంది.. తాజాగా సుమ చిన్నతనంలో స్కూల్ ఏజ్ లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో అమ్మకి చాలా ఇష్టం.. నేను భద్ర అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేచుకున్నా అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సుమ ఈ  ఫోటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read:

ఈ అక్కా చెల్లెల్లు బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు .. వీరిలో ఒకరు మన స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టగలరా

ఆచార్య మూవీ యాక్షన్ సీన్ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న చరణ్