సుశాంత్ మృతి: మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్య స్వామి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి మిస్టరీ కొనసాగుతోంది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని కుటుంబ సభ్యులతో పాటు

సుశాంత్ మృతి: మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్య స్వామి

Edited By:

Updated on: Aug 14, 2020 | 10:18 AM

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి మిస్టరీ కొనసాగుతోంది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్య చేశారని కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలను తేల్చేందుకు సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ, విచారణను ఇంకా ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే సుశాంత్ అనుమానాస్పద మృతిపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ వస్తోన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. తాజాగా మరిన్ని ప్రశ్నలను సంధించారు.

”సుశాంత్ మరణించినప్పుడు రెండు అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి..? ఎవరు ఫోన్ చేశారు..? ఇందులో నిజానిజాలు తెలుసుకోకపోతే, సుశాంత్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న‌ సర్వెంట్‌గా ఉన్న శామ్యూల్ ఎందుకు మిస్ అయ్యాడు. అతడు బతికి ఉన్నాడా..? చనిపోయాడా..? రెండో అంబులెన్స్ అతడి కోసమే వచ్చిందా..?” అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నలను కురిపించారు. అందుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. ”సర్‌ అతడు బతికే ఉన్నాడు. ఓ జాతీయ ఛానెల్‌కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు” అని కామెంట్ పెట్టారు. అందుకు సుబ్రహ్మణ్య స్వామి ”థ్యాంక్స్” అని రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ ఇద్దరు శామ్యూల్‌లు ఉన్నారు సర్‌. వారిలో ఒకరు ఈడీ ముందు(శామ్యూల్‌ మిరిందా) హాజరయ్యారు. మరొకరు(శామ్యూల్‌ హాయోకిప్‌) గతేడాదే సుశాంత్‌ ఇంటి నుంచి బయటకు వచ్చాడు అని కామెంట్ పెట్టారు.

Read More:

పవన్‌ గైర్హాజరు.. మళ్లీ అనుమానాలు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1920 కొత్త కేసులు.. 9 మరణాలు