Breaking News
  • బతకటం కాదు.. ఇతరులకు ఉపయోగపడేలా బతకటం గొప్ప. భౌతికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దూరమయ్యారు. కానీ ఆయన గళం సంగీతం ఉన్నన్నాళ్లు బతికే ఉంటుంది: రామ్ గోపాల్‌ వర్మ.
  • గాన గంధర్వుని మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రగాఢ సంతాపం. 'బాలు'కి నివాళిగా రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ మూసివేతకు పిలుపు. 16 భాషల్లో నలభై వేల పాటలు పాడిన 'కారణజన్ముడు' ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ప్రముఖ గాయని-'తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్' అధ్యక్షురాలు విజయలక్ష్మి. రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ అన్నీ స్వచ్చందంగా మూసివేయాలని.. గాయనీగాయకులంతా పాటల రికార్డింగ్స్ కు దూరంగా ఉండాలని.. తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, కార్యదర్శి లీనస్, కోశాధికారి రమణ శీలం పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలకు లోబడి గాన గంధర్వునికి ఘన నివాళి అర్పించేందుకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని విజయలక్ష్మి తెలిపారు.
  • దేశవ్యాప్త కోవిడ్ గణాంకాలు: 24 గంటల వ్యవధిలో మరణాలు 1,141. మొత్తం కోవిడ్ మరణాలు 92,290. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 58,18,571. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 9,70,116. దేశంలో మొత్తం రికవరీలు 47,56,164.
  • అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. : రాజమౌళి.
  • అమరావతి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్, సిఐడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడపాటి బాల సత్యనారాయణ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • అమరావతి : ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్‌లో పరామర్శ. అమరావతి: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ.చరణ్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటని అన్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1920 కొత్త కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1920 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 88,396కు చేరింది.

Telangana Corona Updates, కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1920 కొత్త కేసులు.. 9 మరణాలు

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 1920 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 88,396కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 674కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1210 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 64,284కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 22,046 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 7,11,196కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 356, ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 34, జగిత్యాల్‌ 40, జనగాం 38, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 51, కామారెడ్డి 44, కరీంనగర్‌ 73, ఖమ్మం 71, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 17, మహబూబ్‌ నగర్‌ 48, మహబూబాబాద్‌ 38, మంచిర్యాల్‌ 18, మెదక్‌ 39, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 168, ములుగు 12, నాగర్‌ కర్నూల్‌ 26, నల్గొండ 73, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 37, నిజామాబాద్‌ 63, పెద్దంపల్లి 54, రాజన్న సిరిసిల్ల 33, రంగారెడ్డి 134, సంగారెడ్డి 90, సిద్ధిపేట్‌ 63, సూర్యాపేట 47, వికారాబాద్‌ 14, వనపర్తి 41, వరంగల్‌ రూరల్‌ 54, వరంగల్‌ అర్బన్‌ 74, యాద్రాది భువనగిరి 16 కేసులు నమోదయ్యాయి.

Read More:

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’‌పై తెలంగాణ దృష్టి

కరోనా మూలాలు.. గబ్బిలాల కోసం థాయిలాండ్‌ శాస్త్రవేత్తల అన్వేషణ

Related Tags