Tamannaah Bhatia: ఈ 5 ఫుడ్స్‌తో పూర్తి ఫిట్‌నెస్.. సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా ఫిట్‌నెట్‌ ట్రైనర్

సినీ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్ ఐకాన్‌గా తమన్నా భాటియాకి ప్రత్యేక ఇమేజ్​ ఉంది. బిజీ షూటింగ్ షెడ్యూల్స్​ మధ్య కూడా ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఇటీవల ఆమె పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక ఆసక్తికరమైన ..

Tamannaah Bhatia: ఈ 5 ఫుడ్స్‌తో పూర్తి ఫిట్‌నెస్.. సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా ఫిట్‌నెట్‌ ట్రైనర్
Tamannaahh B

Updated on: Nov 29, 2025 | 11:51 AM

సినీ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్ ఐకాన్‌గా తమన్నా భాటియాకి ప్రత్యేక ఇమేజ్​ ఉంది. బిజీ షూటింగ్ షెడ్యూల్స్​ మధ్య కూడా ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఇటీవల ఆమె పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్​చేశాడు. గత 10 ఏళ్లుగా తన డైట్‌లో తప్పకుండా చేర్చుకునే 5 సూపర్‌ఫుడ్స్‌ను బయటపెట్టాడు. ఈ ఆహారాలు సరళమైనవే కానీ, వాటి ప్రయోజనాలు అద్భుతమైనవి. ‘ఈ 5 ఫుడ్స్‌తో నా ఫిట్‌నెస్ ట్రాక్‌లో ఉంది.. మీరు కూడా ట్రై చేయండి!’ అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ. ఆ సీక్రెట్ ఫుడ్స్​ ఏంటో మనమూ తెలుసుకుందాం..

1. గ్రీక్ యోగర్ట్ (Greek Yogurt)

ప్రోటీన్ రిచ్ యోగర్ట్ కడుపు నిండుగా ఉంచి, పోషకాలు అందిస్తుంది. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్‌తో మిక్స్ చేసి తినవచ్చు. ప్రొబయోటిక్స్ వల్ల డైజెషన్ మెరుగుపడుతుంది, బరువు కంట్రోల్ సులువవుతుంది.

2. ఎగ్స్ (Eggs)

రోజూ 2–3 బాయిల్డ్ ఎగ్స్ తినాలి. పూర్తి ప్రోటీన్ సోర్స్. మసిల్స్ బిల్డింగ్ & ఫ్యాట్ బర్నింగ్‌కి ఐడియల్. సిద్ధార్థ్​ చెప్పినట్టు, “ఎనర్జీ గ్రాట్‌లో ఉంచుతాయి!” షూటింగ్ బ్రేక్‌లలో కూడా పర్ఫెక్ట్ స్నాక్.

3. చికెన్ (Chicken)

లీన్ ప్రోటీన్ రిచ్ గ్రిల్డ్ లేదా బాయిల్డ్ చికెన్, లంచ్‌లో చేర్చుకోవాలి. మసిల్ రిపేర్ & రికవరీకి టాప్ చాయిస్. 10 ఏళ్ల కన్సిస్టెన్సీ వల్లే ఫిట్‌నెస్ స్థిరంగా ఉంది.

4. ఫ్రూట్స్(Fruits)

యాంటీఆక్సిడెంట్స్ ప్యాక్డ్ యాపిల్స్, బెర్రీస్, బొప్పాయి – స్నాక్స్‌గా తినండి. స్కిన్ గ్లో, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయి. స్వీట్ క్రేవింగ్స్‌ను స్మార్ట్‌గా కట్ చేస్తాయి. ఏ ఫ్రూట్స్​ తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.

5.బ్రెడ్(Bread)

మల్టీగ్రెయిన్ లేదా వుట్ బ్రెడ్ – కాంప్లెక్స్ కార్బ్స్ & ఫైబర్. బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచి, ఎనర్జీ ఇస్తుంది. అవాయిడ్ చేయకండి, స్మార్ట్‌గా తినండి! అంటున్నాడు సిద్ధార్థ. ఈ 5 ఫుడ్స్‌ను బ్యాలెన్స్‌డ్ డైట్​లో చేర్చుకోవడమే సీక్రెట్. ఈ సింపుల్ హ్యాబిట్స్‌తో యూత్‌ఫుల్ లుక్‌ను మెయింటైన్ చేసేందుకు మీరు కూడా ట్రై చేసి చూడండి!