
ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన శ్రీకాంత్ కెరియర్ ఆరంభంలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేస్తూ వచ్చాడు.

ఆ తరువాత హీరోగా మారిన ఆయన తన టాలెంట్ తో వరుస సినిమాలతో దూసుకుపోయాడు.

రొమాంటిక్ హీరోగాను .. యాక్షన్ హీరోగాను .. ఫ్యామిలీ హీరోగాను మంచి మార్కులు కొట్టేశాడు.

మల్టీ స్టారర్ సినిమాలను సైతం చేస్తూ చాలా వేగంగా 100 సినిమాలను పూర్తిచేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

కేరక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు.

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమాతో శ్రీకాంత్ పవర్ఫుల్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు మూడు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది.