బాలయ్య కోసం బోయపాటి భారీ ప్లాన్.. బీబీ3లోకి రియల్ హీరోను దించే పనిలో డైరెక్టర్ ?

|

Feb 02, 2021 | 8:43 PM

డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరీ బాలకృష్ణ కాంబోలో మూడవ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు

బాలయ్య కోసం బోయపాటి భారీ ప్లాన్.. బీబీ3లోకి రియల్ హీరోను దించే పనిలో డైరెక్టర్ ?
Follow us on

Balakrishna Boyapati Movie Update: డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరీ బాలకృష్ణ కాంబోలో మూడవ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‏గా నిలవడంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రయూనిట్.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో గాసిప్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో సోనూసూద్‏ను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్ర కోసం సోనూ సూద్‏ను తీసుకోవడానికి డైరెక్టర్ బోయపాటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. కానీ ప్రస్తుతం సోనూ సూద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ సినిమాలో నటించేందుకు సోనూ అంగీకరిస్తాడా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

రూటు మార్చిన ప్రభాస్ హీరోయిన్.. ఫ్యామిలీ ఎంటర్‏టైనర్ వైపు అడుగులు వేస్తున్న స్వీటీ..

సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..