‘మ్యూజిక్ ఇండస్ట్రీ’లోనూ ఆత్మహత్యలు జరగొచ్చు: సోనూ నిగమ్

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో నెపోజిటం నడుస్తుందని, టాలెంట్ ఉన్నా బయటి వారిని ప్రోత్సహించరని పలువురు సెలబ్రిటీలు చెబుతున్నారు.

మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆత్మహత్యలు జరగొచ్చు: సోనూ నిగమ్

Edited By:

Updated on: Jun 20, 2020 | 4:45 PM

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో నెపోజిటం నడుస్తుందని, టాలెంట్ ఉన్నా బయటి వారిని ప్రోత్సహించరని పలువురు సెలబ్రిటీలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మ్యూజిక్ ఇండస్ట్రీని రెండు మాఫియాలు ఏలుతున్నాయని ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ బాంబు పేల్చారు. మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ త్వరలో ఆత్మహత్యలను మీరు వింటారని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన సోనూ.. పలు సంచలన విషయాలు వెల్లడించారు.

”సుశాంత్ మరణించాడు. ఓ నటుడు చనిపోయాడు. రేపు ఇదే విధంగా ఓ గాయకుడో, సంగీత దర్శకుడో, లిరిక్ రైటరో ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇక్కడి ఫిలిం ఇండస్ట్రీలో మాఫియాలు ఉన్నాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలోని రెండు మాఫియాలు ప్రతీది తమ కంట్రోల్‌లో పెట్టుకున్నాయి. ఎవరు పాడాలి..? ఎవరు పాడకూడదు..? అని ఆ రెండు మాఫియాలే నిర్ణయిస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు రూల్ చేయాలనుకుంటారు.

ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వారికి ఇప్పుడు చాలా కష్టం. అదృష్టవశాత్తు నేను చాలా చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగెట్టాను. ఇలాంటి వాటిని నేను దాటుకొచ్చాను. కొన్ని సార్లు నేను పాడి వచ్చిన పాటలను వేరే వారి చేత డబ్బింగ్ చేయించారు. నాకే ఇలా జరిగినప్పుడు కొత్త వారి పరిస్థితి ఏంటి..? 15 సంవత్సరాలుగా నేను పాటలు పాడటం లేదు. కానీ నేనేం ఫీల్ అవ్వను. నా సొంత ప్రపంచంలో నేను హ్యాపీగా ఉన్నా. కానీ కొత్తగా వస్తున్న గాయకులు, మ్యూజిక్ కంపోజర్లు, రిలిక్ రైటర్ల కళ్లు, వాయిస్, మాటల్లో ఆ బాధను నేను చూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. కాగా సోనూ వ్యాఖ్యలపై పలువురు సింగర్లు స్పందించారు. ఇక్కడ అలాంటివి ఏవీ లేవని వారు చెప్పుకురావడం గమనర్హం.

Read This Story Also : పవన్‌కి షాక్ ఇచ్చిన శ్రుతీ హాసన్..!