Pamela Quits Social Media: సోషల్ మీడియాతో సమయం వృధా అవుతుంది.. ఇక నుంచి సోషల్ మీడియాకు గుడ్‌బై అంటున్న హాలీవుడ్ నటి

సోషల్ మీడియా ప్రపంచాన్ని అంతటినీ ఒక్కటి చేసింది.. కుటుంబంలో ఎవరికీ ఎవరూ కాకుండా చేసింది అని చెప్పవచ్చు.. తాజాగా హాలీవుడ్ నటి తనపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని.. తన మనసును ..

Pamela Quits Social Media:  సోషల్ మీడియాతో సమయం వృధా అవుతుంది.. ఇక నుంచి సోషల్ మీడియాకు గుడ్‌బై అంటున్న హాలీవుడ్ నటి

Updated on: Jan 27, 2021 | 5:29 PM

Pamela Quits Social Media: స్మార్ట్ ఫోన్లు నెట్ వర్క్స్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది అని చెప్పవచ్చు.. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ప్రపంచాన్ని అంతటినీ ఒక్కటి చేసింది.. కుటుంబంలో ఎవరికీ ఎవరూ కాకుండా చేసింది అని చెప్పవచ్చు..ఇక సెలబ్రెటీలైతే తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్నీ ఈ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.. తాజాగా హాలీవుడ్ నటి తనపై ..సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని.. తన మనసును సోషల్ మీడియా అదుపు చేసే స్థాయికి చేరుకుంది కనుక నేను ట్విటర్, ఇన్స్టాగ్రామ్ లకు గుడ్ బై చెబుతున్నాని ప్రకటించింది.

అమెరికన్-కెనడియన్ నటి, మోడల్ పమేలా ఆండర్సన్ సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక ఫోటో ని పోస్ట్ చేసిన పమేలా ఇదే నా చివరి పోస్ట్.. ఇక నుంచి నేను సోషల్ మీడియా నుంచి విముక్తి పొందుతున్నా.. సోషల్ మీడియా నా జీవితం పై అత్యంత ప్రభావం చూపిస్తుంది.. నా మనసుని అది కంట్రోల్ లో పెట్టుకుంది. నేను సోషల్ మీడియా కోసం ఉపయోగించే సమయాన్ని ఇక నుంచి సంపాదన కోసం ఉపయోగిస్తానని పమేలా చెప్పింది. ఇక నుంచి నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నా అని చెప్పిందీ హాలీవుడ్ సుందరి.

Also Read:  ఈ గ్యాప్ లేకుండా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5