ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ వేదికగా విడుదలవుతోంది. దీంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు థియేటర్, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో సినిమాలు వస్తున్నాయి. దీంతో బుల్లి తెరపై సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే కథలో కంటెంట్ ఉండాలే కానీ ఎన్నిసార్లు టెలికాస్ట్ అయినా సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గదని రెండు చిత్రాలు నిరూపించాయి. వీటిలో ఒకటి సీతారామం కాగా మరొకటి కార్తికేయ2.
దాదాపు ఒకటే సమయంలో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు కరోనా కారణంగా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించని ప్రేక్షకులను ఈ రెండు చిత్రాలు రప్పించేలా చేశాయి. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లను కలెక్ట్ చేసి దుమ్మురేపాయి ఈ చిత్రాలు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం చిత్రానికి రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి.
కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ రెండు చిత్రాలు సత్తా చాటాయి. హైయెస్ట్ వ్యూస్‌తో దుమ్మురేపాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ రెండు చిత్రాలు బుల్లి తెరపై కూడా సందడి చేశాయి. ఇటీవల టీవీలో ప్రసారమైన సీతారామం చిత్రానికి 8.73 టీర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇక కార్తికేయ2 7.88 రేటింగ్‌ను అందుకుంది. కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు సినిమాలను ఇష్టపడతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్‌గా నిలిచాయి ఈ రెండు చిత్రాలు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..