Singer Smita: సింగర్‌ స్మితకు కరోనా పాజిటివ్‌

ప్రముఖ సింగర్‌, రాపర్ స్మితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్మిత సోషల్ మీడియాలో వెల్లడించారు.

Singer Smita: సింగర్‌ స్మితకు కరోనా పాజిటివ్‌

Edited By:

Updated on: Aug 04, 2020 | 5:48 PM

Smita tests positive for corona: ప్రముఖ సింగర్‌, రాపర్ స్మితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్మిత సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు లేవని, కానీ ఒళ్లు నొప్పులు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు తేలిందని ఆమె అన్నారు. తనతో పాటు తన భర్త శశాంక్‌కి కరోనా వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఇంట్లో సేఫ్‌గానే ఉన్నప్పటికీ కరోనా తమ ఇంటికి వచ్చిందంటూ స్మిత తెలిపారు. త్వరలో కరోనాను జయించి ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్మిత ట్వీట్ చేశారు. కాగా టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Read This Story Also: అమెరికాలో దారుణ హత్యకు గురైన భారత సంతతి పరిశోధకురాలు