ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్‌ను ఇప్పుడు నేను చేసి మెప్పించగలను.. అలనాటి హీరోయిన్‌కు వచ్చిన అరుదైన అవకాశం..

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న అలనాటి హీరోయిన్ సిమ్రాన్ అందరికి గుర్తుండే ఉంటుంది. దాదాపుగా తెలుగు

ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్‌ను ఇప్పుడు నేను చేసి మెప్పించగలను.. అలనాటి హీరోయిన్‌కు వచ్చిన అరుదైన అవకాశం..

Updated on: Dec 12, 2020 | 8:26 AM

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న అలనాటి హీరోయిన్ సిమ్రాన్ అందరికి గుర్తుండే ఉంటుంది. దాదాపుగా తెలుగు హీరోలందరితో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది. తన నటనతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సిమ్రాన్ ఇటీవలసెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అడప దడపా తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది.

అయితే సిమ్రాన్‌కు ఇటీవల ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో నటించే అవకాశం దొరికింది. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ అంధా ధున్‌ తమిళ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌ని సిమ్రాన్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత ఇటువంటి పాత్ర చేస్తున్నానని, ఓ కొత్త అవతారంలో కనిపించడం చాలా ఆనందంగా ఉందని ప్రకటించారు. అయితే అంధాదున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను వెటరన్ తమిళ హీరో ప్రశాంత్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి. త్వరలోనే షూటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు.