Bigg Boss 5 : ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తమిళ వెర్షన్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు అన్ని సీజన్లలో కమల్ హాసన్ హోస్ట్‌గా చేసారు.. అంతేకాకుండా తన రాజకీయ ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఐదో సీజన్‌కి కొత్త హోస్ట్ వస్తున్నారని తెలుస్తోంది. మొదటి మూడు సీజన్ల మాదిరిగానే ఈ సంవత్సరం జూన్ లేదా జూలైలో ప్రదర్శనను ప్రారంభించాలనే ప్రణాళికతో ‘బిగ్ బాస్ 5’ ప్రారంభ పనులు మొదలయ్యాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ‘బిగ్ బాస్ 4’ అక్టోబర్‌లో ఆలస్యంగా ప్రారంభమై జనవరిలో ముగిసిన సంగతి తెలిసిందే.
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ స్థాపించి తమిళనాడు ఎన్నికల్లో బిజీగా మారాడు. అంతేకాకుండా ఏప్రిల్ 6 న తమిళనాడు అసెంబ్లీకి జరిగే తన మొదటి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్ 5కి హోస్ట్‌గా వ్యవహరించడం అనుమానమే. దీంతో తెరపైకి మరో యువ నటుడి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ‘బిగ్ బాస్ 5’ నిర్మాతలు కమల్ స్థానంలో మాస్ హీరో శింబూతో చర్చలు ప్రారంభించారని, ఆయనకు కూడా చాలా ఆసక్తి ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.
తమిళనాట హీరో శింబుకి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మాస్ హీరోగా మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వం ‘మనాడు’ చిత్రాల చిత్రీకరణలో ఉన్నాడు. కల్యాణి ప్రియదర్శన్, గౌతమ్ కార్తీక్, ప్రియ భవానీ శంకర్ నటించిన ‘పాతు థాల’ మూవీలో కూడా నటిస్తున్నాడు.