Actress Shruthi haasan: శృతిహాసన్ ఎక్కడా తగ్గడం లేదుగా.. ‘సలార్’ కోసం భారీగా రెమ్యునరేషన్ ?

|

Jan 30, 2021 | 1:22 PM

రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన 'క్రాక్' సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ హిట్‏తో

Actress Shruthi haasan: శృతిహాసన్ ఎక్కడా తగ్గడం లేదుగా.. సలార్ కోసం భారీగా రెమ్యునరేషన్ ?
Follow us on

రవితేజ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘క్రాక్’ సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ హిట్‏తో శృతిహాసన్ తిరిగి ఫాంలోకి వచ్చింది. దీంతో ఈ అమ్మడుకి భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముందుగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సలార్‏లో శృతిహాసన్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.

ఇదిలా ఉండగా.. క్రాక్ సినిమా హిట్‏తో శృతి హాసన్ తన రెమ్యనరేషన్‏ను భారీగా పెంచేసిందట. ఇక ప్రభాస్ సలార్ సినిమాలో నటించడానికి శృతి ఏకంగా కోటి రూపాయాలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో వరుస ఫ్లాపులను ఎదుర్కోన్న శృతి ఈ ఒక్క సినిమాతో అమాంతం రెమ్యునరేషన్ పెంచేసినట్లుగా కనపిస్తోంది. అంతేకాదు.. ప్రభాస్ మూవీ సలార్ కూడా సూపర్ హిట్ కొడితే.. మళ్లీ తన రెమ్యునరేషన్‏ను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.