శర్వా టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్..!

| Edited By:

Mar 04, 2019 | 11:00 AM

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అయితే ఇంతవరకు టైటిల్‌ను మాత్రం ప్రకటించలేదు. ‘దళపతి’, ‘భరోసా’ అనే టైటిళ్లు ఈ మూవీ కోసం వినిపించినప్పటికీ.. అవి కూడా కన్ఫర్మ్ కాలేదు. కాగా ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ నెల 6న శర్వానంద్ పుట్టినరోజు ఉండగా.. అదే రోజున టైటిల్‌ను విడుదల చేయనున్నారట. అందుకోసం రెండు మూడు టైటిళ్లను పరిశీలిస్తున్నారట. కాగా ఈ […]

శర్వా టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్..!
Follow us on

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అయితే ఇంతవరకు టైటిల్‌ను మాత్రం ప్రకటించలేదు. ‘దళపతి’, ‘భరోసా’ అనే టైటిళ్లు ఈ మూవీ కోసం వినిపించినప్పటికీ.. అవి కూడా కన్ఫర్మ్ కాలేదు. కాగా ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారట.

ఈ నెల 6న శర్వానంద్ పుట్టినరోజు ఉండగా.. అదే రోజున టైటిల్‌ను విడుదల చేయనున్నారట. అందుకోసం రెండు మూడు టైటిళ్లను పరిశీలిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో శర్వానంద్ ద్విపాత్రాభినయంలో నటించనున్నాడు. ఓల్డ్ ఏజ్ డాన్‌గా, యంగ్‌ మ్యాన్‌గా శర్వా కనిపించనుండగా.. ఆయన సరసన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.