జూనియర్ ఎన్టీఆర్‌ అనుకుంటే పొరబాటే.. ఈయనే డూప్లికేట్ యంగ్ టైగర్

అచ్చు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌లా ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. . జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో ఉండటమే కాకుండా.. నటనలో కూడా అతనికి ఏ మాత్రం తగ్గడం లేదు. పంజాబ్ వాసి అయిన షమీందర్ సింగ్.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేశాడు. తాజాగా.. షమిందర్ సింగ్ ఫోటోలు, తారక్ సినిమా డైలాగ్స్‌కు చేసిన డబ్ స్మాష్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు తనకు రావాలనుందని.. అయితే అభిమానులు తనను నిజంగానే […]

జూనియర్ ఎన్టీఆర్‌ అనుకుంటే పొరబాటే.. ఈయనే డూప్లికేట్ యంగ్ టైగర్

Edited By:

Updated on: May 14, 2019 | 11:25 AM

అచ్చు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌లా ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. . జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో ఉండటమే కాకుండా.. నటనలో కూడా అతనికి ఏ మాత్రం తగ్గడం లేదు. పంజాబ్ వాసి అయిన షమీందర్ సింగ్.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేశాడు. తాజాగా.. షమిందర్ సింగ్ ఫోటోలు, తారక్ సినిమా డైలాగ్స్‌కు చేసిన డబ్ స్మాష్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు తనకు రావాలనుందని.. అయితే అభిమానులు తనను నిజంగానే ఎన్టీఆర్ అనుకుని.. ఎక్కడ వెనుకపడ్తారో అని భయమేస్తోందని షమీందర్ తెలిపాడు. ఎన్టీఆర్ సన్నిహితుడు, నిర్మాత మహేశ్ కోనేరును ట్యాగ్ చేస్తూ.. షమీందర్ పలు ట్వీట్స్ చేశాడు. తారక్ నటించిన ఎన్నో సినిమాల్లోని డైలాగ్‌లను అనుకరిస్తూ.. వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు.

Follow Us