19 ఏళ్ళ తర్వాత ఆ హీరోయిన్ రీఎంట్రీ.. ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న అజిత్ సతిమణి..
తమిళ స్టార్ హీరో అజిత్ సతిమణి షాలినీ వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలనటిగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న షాలినీ.. ఆ తర్వాత 'సఖి'
తమిళ స్టార్ హీరో అజిత్ సతిమణి షాలినీ వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలనటిగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న షాలినీ.. ఆ తర్వాత ‘సఖి’ సినిమాతో హీరోయిన్గా కూడా రాణించింది. టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతున్న సమయంలోనే షాలినీ.. హీరో అజిత్‌ను లవ్ మ్యారెజ్ చేసుకొని.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత షాలినీ పూర్తిగా కుటుంబానికే అంకితమైపోయింది. 2001లో విడుదలైన ప్రియద వరం వెండూమ్ సినిమా తర్వాత షాలినీ ఏ చిత్రాల్లో నటించలేదు. ఇదిలా ఉండగా.. షాలినీ తిరిగి వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రిలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమాతో షాలినీ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 19 సంవత్సరాల తర్వాత షాలినీ మళ్లీ సినిమాల్లో నటించనుంది. ఇదిలా ఉండగా.. త్రిష, కార్తీ, ఐశ్వర్య రాయ్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో షాలినీ ఓ కీలక పాత్రలో నటించనున్నారట. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే త్వరలో ఈ సినిమా చిత్రీకరణలో షాలినీ పాల్గోననున్నట్లుగా సమాచారం. దీనిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ నుంచి గానీ.. షాలినీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
Also Read: