షారుక్ ఖాన్ సంచలన నిర్ణయం, రిటైర్మెంట్ పై బాలీవుడ్ బాద్ షా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన అవసరమే లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవల వరుస హిట్స్ అందుకొని సక్సెస్ లోకి వచ్చాడు. ఈ స్టార్ తన రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిత్ర పరిశ్రమలో తన 35 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రస్తావించాడు. 

షారుక్ ఖాన్ సంచలన నిర్ణయం, రిటైర్మెంట్ పై బాలీవుడ్ బాద్ షా షాకింగ్ కామెంట్స్
Shahrukh Khan

Updated on: Feb 15, 2024 | 5:00 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన అవసరమే లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవల వరుస హిట్స్ అందుకొని సక్సెస్ లోకి వచ్చాడు. ఈ స్టార్ తన రిటైర్మెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిత్ర పరిశ్రమలో తన 35 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రస్తావించాడు.  వైఫల్యాల ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు. సహనం, పట్టుదల,  ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.  అయితే ఈ స్టార్ హీరోకు 58 సంవత్సరాల వయస్సు. కాగా పరిశ్రమలో మరో 35 సంవత్సరాలు పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. 93 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ వయస్సుపై దృష్టి పెట్టాడు. షారుఖ్‌కు సినిమా పట్ల అచంచలమైన అభిరుచి, నిబద్ధతను ఎంటో తెలియజేస్తుంది.

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజా చిత్రం “డంకీ,” ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించబడింది. ఈ మూవీకి  సానుకూల సమీక్షలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్‌మెంట్ ప్లాన్‌ల వివరాలను వెల్లడించాడు. 2017లో “జబ్ హ్యారీ మెట్ సెజల్” మరియు 2018లో “జీరో” వంటి చిత్రాలతో నిరాశపరిచిన షారుక్ నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే “పఠాన్,” “జవాన్,” ఇప్పుడు “డుంకీ” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒకే సంవత్సరంలో వార్తల్లో నిలిచాడు.

డంకీ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. ఇప్పుడు కూడా హిందీలోనే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌ తో తెలుగు ఆడియెన్స్‌ చూడొచ్చు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. లండన్ వెళ్లి బాగా బతకాలనుకొనే కొంతమంది వీసా రిజెక్ట్ అవ్వడంతో అడ్డదారిలో దేశాలు దాటుతూ ఎలా వెళ్లారు? వెళ్లే మార్గంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు? లండన్‌ వెళ్లాక వారికి ఏమైంది? అన్నది డంకీ సినిమా కథ. దీనికి ఎమోషనల్‌ టచ్ ఇస్తూ రాజ్‌ కుమార్‌ హిరానీ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడు. మరి థియేటర్స్‌ లో డంకీ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఈ వీకెండ్‌లో ఎంచెక్కా ఓటీటీలోనే చూసి ఎంజాయ్‌ చేయండి.