‘షారుఖ్’ గెస్ట్ రోల్.. వీడిన సస్పెన్స్!

స్టార్ హీరోలు సినిమాల్లో అతిధి పాత్రలో కనిపిస్తే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే స్టార్స్ మాత్రం పెద్దగా అతిధి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించరు. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో షారుఖ్ ఈ రోల్‌లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇందులో షారుఖ్ అతిధి పాత్ర చెయ్యట్లేదు.. కానీ […]

షారుఖ్ గెస్ట్ రోల్.. వీడిన సస్పెన్స్!

Updated on: May 20, 2019 | 12:53 PM

స్టార్ హీరోలు సినిమాల్లో అతిధి పాత్రలో కనిపిస్తే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే స్టార్స్ మాత్రం పెద్దగా అతిధి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించరు. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఓ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో షారుఖ్ ఈ రోల్‌లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇందులో షారుఖ్ అతిధి పాత్ర చెయ్యట్లేదు.. కానీ

బాలీవుడ్‌లో రాజ్ కుమార్ రావు, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్న ‘మెంటల్ హై క్యా’ సినిమాలో షారుఖ్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ వార్తలను స్వయంగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. ఇక షారుఖ్ రోల్ ఏంటి.. ఎంతసేపు ఉంటుంది అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.