Breaking: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ‘జెర్సీ’ హిందీ వెర్షన్ విడుదల వాయిదా..

|

Dec 28, 2021 | 6:00 PM

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'జెర్సీ' హిందీ రీమేక్‌ను విడుదలను వాయిదా వేస్తున్నట్లు..

Breaking: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. జెర్సీ హిందీ వెర్షన్ విడుదల వాయిదా..
Jersey
Follow us on

షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘జెర్సీ’ విడుదల మరోసారి విడుదలను వాయిదా పడింది. ఇప్పటికే పలు అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతూ వస్తుండగా.. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన ఎట్టికేలకు థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. అయితే ఇప్పుడు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా విడుదలను మరోసారి వాయిదా వేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని.. ఓటీటీలో విడుదల చేస్తామని వస్తోన్న వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ’ మూవీకి ఇది హిందీ రీమేక్. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించారు. దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్ ఈ సినిమాను కలిసి సంయుక్తంగా నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సుమారు రూ. 150 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు.