Shah Rukh Khan: ఖరీదైన వాచ్‌లతో వచ్చిన షారుఖ్‌ ఖాన్‌‌.. అడ్డుకున్న కస్టమ్స్‌ అధికారులు.. చివరకు..

ముంబై ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు షారూఖ్ ను అడ్డుకున్నారు. షార్జాలో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ వెళ్లొస్తుండగా..

Shah Rukh Khan: ఖరీదైన వాచ్‌లతో వచ్చిన షారుఖ్‌ ఖాన్‌‌.. అడ్డుకున్న కస్టమ్స్‌ అధికారులు.. చివరకు..
Shahrukh Khan
Follow us

|

Updated on: Nov 13, 2022 | 5:00 AM

ముంబై ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు షారూఖ్ ను అడ్డుకున్నారు. షార్జాలో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ వెళ్లొస్తుండగా షారుక్ తోపాటు ఆయన టీంను టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దగ్గర నిలిపివేశారు. ఆయనతో ఉన్న లగేజీని గంటపాటు చెక్ చేసి విచారణ చేశారు. ఈ తనిఖీల్లో ఆపిల్‌ ఐవాచ్ తోపాటు ఆరు ఖరీదైన లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆరు వాచీలకు కస్టమ్స్ డ్యూటీ ప్రకారం రూ. 6.88 లక్షలు చెల్లించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు షారుఖ్ ఖాన్. ఈ విషయంలో కస్టమ్ డ్యూటీ చెల్లించాకే అధికారులు విడిచిపెట్టినట్లు తెలుస్తుంది.

కస్టమ్ డ్యూటీ మొత్తం క్రెడిట్ కార్డు నుంచే షారుఖ్ చెల్లించినట్లు పేర్కొంటున్నారు. అయితే షారుక్ తిరిగి స్వాధీనం చేసుకున్న వాచీల విలువ సుమారుగా 17.86 లక్షల రూపాయలు ఉంటాయని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. దీనికి 30 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన అనంతరం విడిచిపెట్టినట్లు తెలిపారు. షారుఖ్ ఖాన్ లగేజీ స్క్రీనింగ్ అనంతరం ఆయన బాడీ గార్డుతో పాటుగా మరికొంత మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణ తర్వాత వారిని విడిచిపెట్టారు.

గడియారాలు ఉన్న బ్యాగ్‌ని షారూఖ్ ఖాన్ బాడీగార్డ్ రవిశంకర్ సింగ్ తీసుకెళ్లారని అధికారి తెలిపారు. చలాన్ రవిశంకర్ సింగ్ పేరు మీద ఉన్నప్పటికీ, ఖాన్ కస్టమ్స్ డ్యూటీ సుంకం చెల్లించినట్లు అధికారి తెలిపారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించే ప్రక్రియ ముగిసిన తర్వాత వెళ్లేందుకు అనుమతించినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కు అటెండ్ అయిన షారుఖ్ ఖాన్ కు గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డుతో సత్కరించారు. ప్రస్తుతం పఠాన్ అనే మూవీలో నటిస్తున్నారు. షారుఖ్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో