Sara on mom Amrita Singh: తల్లిదండ్రుల నుంచే నటన వారసత్వంగా వచ్చింది..అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే: సారా

|

Jan 18, 2021 | 6:06 PM

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ , అమృతా సింగ్‌ల ముద్దుల త‌న‌య‌ సారా అలీఖాన్. సుశాంత్ సింగ్ ‌రాజ్‌పుత్‌ నటించిన 'కేధార్‌నాథ్‌' చిత్రంతో సారా వెండితెర అరంగేట్రం చేసింది...

Sara on mom Amrita Singh: తల్లిదండ్రుల నుంచే నటన వారసత్వంగా వచ్చింది..అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే: సారా
Follow us on

Sara on mom Amrita Singh: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ , అమృతా సింగ్‌ల ముద్దుల త‌న‌య‌ సారా అలీఖాన్. సుశాంత్ సింగ్ ‌రాజ్‌పుత్‌ నటించిన ‘కేధార్‌నాథ్‌’ చిత్రంతో సారా వెండితెర అరంగేట్రం చేసింది. తాజాగా సారా అలీఖాన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తల్లి అమృత సింగ్ గురించి, లాక్ డౌన్ అనుభవాలను గురించి పంచుకుంది. తాను తల్లి అమృత సింగ్‌తో ప్రతి విషయం పంచుకుంటాను అమ్మ అన్నీ ఓపికగా వింటుంది. అయితే తల్లి తాను చెప్పే ప్రతి విషయాన్ని విని.. నీమీద నీకు నమ్మకం ఉండాలని.. అప్పుడే ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని చెప్పి నిర్ణయం తనకే వదిలేస్తుందని చెప్పింది సారా.

తన తల్లి అమృత నుంచే వారసత్వంగా నటన, స్టైల్ వచ్చాయని.. ఆమెకు గల పేరు తన సినీ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. కెరీర్‌లో ఎదుగుదలలో తల్లి పాత్ర ఎంతో ఉందని సారా అమృతపై ప్రశంసల వర్షం కురిపించింది. తన తల్లిదండ్రులిద్దరూ నటులే కనుక తనకు సహజంగానే నటనపై ఆసక్తి కలిగిందని.. ఈ రోజు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానంది.

షూటింగ్స్ తో బిజిబిజీ జీవితానికి అలవాటు పడిన తనకు లాక్ డౌన్ సమయంలో ఒక్కసారిగా ఖాళీ దొరికే సరికి ఏమి చెయ్యాలో అర్ధం లేదని సారా లాక్ డౌన్ అనుభవాలను పంచుకుంది. తొమ్మిది నెలలు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అంటే చాలా కష్టమనిపించింది. అయితే ఆ సమయంలో తాను చెయ్యాల్సిన పనుల జాబితాను తయారు చేసుకున్నానంది. ఆ జాబితాలో 500 విషయాలు వచ్చాయని అవి జీవితంలో పూర్తి చేయడం సంతోషాన్ని ఇస్తుందని తెలిపింది. ఇక ప్రతి రోజూ ఉదయం నిద్రలేచి తల్లి అమృతతో గడపడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది.

సైఫ్ అలీ ఖాన్ తనకంటే పెద్దదైన అమృత సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమృత తో విడాకుల అనంతరం మరో హీరోయిన్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది.

Also Read: ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్న అర్నబ్ చాట్స్..కంగనా, హృతిక్ రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు