AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త మూవీ వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లు: సందీప్‌ సెటైర్లు

లాక్‌డౌన్‌ వేళ కరెంట్‌ బిల్లుల రూపంలో అందరికీ షాక్‌లు తగులుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా బిల్లులను చూస్తూ కళ్లు షాక్‌కి గురవుతున్నారు.

కొత్త మూవీ వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లు: సందీప్‌ సెటైర్లు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 30, 2020 | 8:50 PM

Share

లాక్‌డౌన్‌ వేళ కరెంట్‌ బిల్లుల రూపంలో అందరికీ షాక్‌లు తగులుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా బిల్లులను చూస్తూ కళ్లు షాక్‌కి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తాప్సీ, కార్తీక ఇలా పలువురు పవర్‌‌ బిల్లులుపై సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఇవేం బిల్లులు అంటూ కామెంట్లు పెట్టారు. ఇక ఇదే షాక్‌ ఇప్పుడు టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌కి తగిలింది. దీంతో ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన సందీప్‌ సెటైరికల్ పంచ్ ఇచ్చాడు.

మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్‌ని చూస్తే చిన్నప్పుడు గిర్రుమంటూ తిరిగే ఆటో రిక్షా మీటర్‌ గుర్తొచ్చింది. ఏంది సర్‌ ఆ బిల్లు. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చింది అని ఆన్‌లైన్‌ వార్‌ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు. కొత్తగా రిలీజైన సినిమాల వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లులు ఉన్నాయి అని ట్వీట్ చేశారు. అయితే ఎంత బిల్లు వచ్చిందన్న విషయాన్ని మాత్రం సందీప్‌ వెల్లడించలేదు. ఇక సందీప్‌ ట్వీట్‌కు నెటిజన్లు మేము కూడా కరెంట్ బిల్లు బాధితులమేనంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా సందీప్‌ కిషన్ ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Follow Us
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్