Coronavirus: మాట నిలుపుకున్న సల్మాన్.. వారికి మొదటి విడత సాయం!

లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్ కండల వీరుడు ముందుకొచ్చారు. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని ఆ మధ్యన ప్రకటించిన సల్మాన్‌.. అందులో భాగంగా మంగళవారం ఒక్కొక్కరి ఖాతాలో రూ.3000 జమ చేశారు. ఈ విషయాన్ని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్(FWICE)అధ్యక్షుడు బీఎన్‌ తివారీ తెలిపారు. అనంతరం తివారీ మాట్లాడుతూ.. సినీ కార్మికుల బ్యాంకు ఖాతాలకు సల్మాన్ మొదటి విడతగా రూ.3వేలు చొప్పున బదిలీ చేశారు. ఆర్థికంగా […]

Coronavirus: మాట నిలుపుకున్న సల్మాన్.. వారికి మొదటి విడత సాయం!

Edited By:

Updated on: Apr 09, 2020 | 7:29 AM

లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్ కండల వీరుడు ముందుకొచ్చారు. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని ఆ మధ్యన ప్రకటించిన సల్మాన్‌.. అందులో భాగంగా మంగళవారం ఒక్కొక్కరి ఖాతాలో రూ.3000 జమ చేశారు. ఈ విషయాన్ని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్(FWICE)అధ్యక్షుడు బీఎన్‌ తివారీ తెలిపారు.

అనంతరం తివారీ మాట్లాడుతూ.. సినీ కార్మికుల బ్యాంకు ఖాతాలకు సల్మాన్ మొదటి విడతగా రూ.3వేలు చొప్పున బదిలీ చేశారు. ఆర్థికంగా సతమతమౌతోన్న 23 వేల మది సినీ కార్మికుల జాబితాను ఆయనకు ఇచ్చాం. ఒకేసారి పూర్తి మొత్తం ఇస్తే అనవసరంగా ఖర్చు అవుతుందని భావించిన సల్మాన్.. పలు విడతల్లో వారికి సాయం చేయబోతున్నారు. మంగళవారం ప్రతి సినీ కార్మికుడి ఖాతాకు రూ.3వేలు పంపారు. కొన్ని రోజులు తరువాత మళ్లీ వారికి సల్మాన్ డబ్బులు బదిలీ చేస్తారు. పరిస్థితులు చక్కబడే వరకు సల్మాన్‌ వారికి సాయం చేయాలనుకుంటున్నారు అని తెలిపారు. కాగా బాలీవుడ్‌లో సినీ కార్మికులను ఆదుకునేందుకు పలువురు హీరో, హీరోయిన్లతో పాటు దర్శకనిర్మాతలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఏపీలో కోవిడ్ వాలంటీర్లకు నోటిఫికేషన్.. ముందుకొచ్చిన వారికి ఓ ఆఫర్..!