Sai Pallavi: సూపర్‌‌హిట్‌ సినిమాను రిజెక్ట్‌ చేసిన సాయిపల్లవి.. చాన్స్ కొట్టేసిన త్రిష

అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు సాయిపల్లవి సొంతం. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొందరు చెప్తూ ఉంటారు. ఈమె డాక్టర్ చదివి అనంతరం యాక్టర్‌‌ అయ్యారు. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ముందుగా ప్రయత్నాలు చేసిన సాయిపల్లవికి నిరాశే ఎదురైంది. దీంతో చదువుపై దృష్టిపెట్టి మెడిసిన్

Sai Pallavi: సూపర్‌‌హిట్‌ సినిమాను రిజెక్ట్‌ చేసిన సాయిపల్లవి.. చాన్స్ కొట్టేసిన త్రిష
Sai Pallavi

Updated on: Nov 13, 2025 | 8:42 AM

అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు సాయిపల్లవి సొంతం. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొందరు చెప్తూ ఉంటారు. ఈమె డాక్టర్ చదివి అనంతరం యాక్టర్‌‌ అయ్యారు. సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ముందుగా ప్రయత్నాలు చేసిన సాయిపల్లవికి నిరాశే ఎదురైంది. దీంతో చదువుపై దృష్టిపెట్టి మెడిసిన్ పూర్తి చేశారు. అవకాశం చిక్కిన ప్రతిసారీ చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు.

అలా చేస్తున్న సందర్భంలోనే ప్రేమమ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇంకేముంది అదృష్టం ప్రేమమ్ రూపంలో వరించిన సాయిపల్లవి తిరిగి చూడాల్సిన పని లేనంత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రేమమ్ విజయం ఆమె కెరీర్‌‌ను మలుపుతిప్పేసింది. అవకాశాలు క్యూ కట్టాయి. అయితే, ఇక్కడే సాయిపల్లవి తన మార్క్‌ను చూపెట్టారు. వచ్చిన ప్రతి పాత్రకు అంగీకరించకుండా బలమైన, ప్రాధాన్యం, నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్లను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. దాంతో ఆమె నటనతోపాటు సినిమాల ఎంపికలోనూ దిట్ట అని ప్రత్యేకత చాటుకున్నారు.. చాటుకుంటున్నారు కూడా.

సాయిపల్లవికి తెలుగులోనే మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్లు దక్కడం విశేషం. తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా నటించిన తమిళంలో ఆమె నటించిన అమరన్‌ సాయి పల్లవి నటనా ప్రతిభను మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈమధ్య బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి.

పాన్‌ ఇండియా చిత్రంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తున్నారు ఈ ప్రేమమ్ బ్యూటీ. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన పలు ఫోటోలు బయటకు వచ్చాయి. వాటితో సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, అభిమాన హీరోయిన్‌ నటనను చూసేందుకు సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోయిన్‌ తీసుకోనంత రెమ్యునరేషన్‌ రామాయణం సినిమా కోసం సాయిపల్లవి అందుకుంటోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కథ, తన పాత్ర నచ్చితే కానీ సినిమా చేయడానికి సాయిపల్లవి అంగీకరించరనే విషయం తెలిసిందే.

Trisha & Leo

మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని వదులుకున్న సంగతి చాలా మందికి తెలిసిందే. అలాగే, తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందుగా సాయిపల్లవికే వచ్చిందని సమాచారం. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారైందట కూడా. అయితే అందులో పాత్ర తనకు అంతగా నచ్చకపోవడంతో నటించడానికి నో చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాయిపల్లవి తిరస్కరించిన తర్వాత ఆ పాత్రలో త్రిష నటించారు. కాగా, లియో సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.