Viraata Parvam : గుమ్మానికి పసుపు రాస్తున్న అమ్మాడి.. ‘విరాటపర్వం’ నుంచి పోస్టర్ రిలీజ్

సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయిపల్లవి

Viraata Parvam : గుమ్మానికి పసుపు రాస్తున్న అమ్మాడి.. విరాటపర్వం నుంచి పోస్టర్ రిలీజ్
Virataparvam

Updated on: Apr 13, 2021 | 3:00 PM

Viraata Parvam : సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయిపల్లవి కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ఇక ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమానుంచి విడుదలైన కొలొకోలమ్మ అనే పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. అయితే  హీరో రానా ఎన్నో ఆశలు పెట్టుకున్న అరణ్య సినిమా బాక్సాఫిస్ దగ్గర కాస్త నిరాశపరిచింది. కానీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. అతడి భావాలను, అతడి ఆలోచనలు చూసి ప్రేమలో పడిన యువతిగా సాయిపల్లవి కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమానుంచి పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో కేవలం సాయిపల్లవి మాత్రమే ఉంది. సురేష్ బాబు సమర్పకులుగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- ఈశ్వరి రావు- జరీనా వహాబ్ – నివేదా పెథురాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా  ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరిన్ని ఇక్కడ చదవండి : Prema Entha Madhuram: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.

Mohan Babu : డైనమిక్ లుక్ లో అదరగొడుతున్న కలక్షన్ కింగ్.. సన్ ఆఫ్ ఇండియా మూవీ నుంచి మరో పోస్టర్..

BB3 Movie : అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య.. ‘అఖండ’గా రానున్న నటసింహం.. టీజర్ విడుదల