మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
ఇందులో భాగంగా ‘రిపబ్లిక్’ మూవీ మోషన్ పోస్టర్ కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. యువరానర్.. ప్రజలు ఎన్నుకున్ను రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు యూనిట్. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Supreme Hero @IamSaiDharamTej and @devakatta‘s #Republic into public from June 4th, 2021#SDT14 #RepublicOnJune4th
@aishu_dil @IamJagguBhai @meramyakrishnan #ManiSharma @bkrsatish @Cinemainmygenes @JBEnt_Offl @ZeeStudios_ pic.twitter.com/wESzWVftCW— BARaju (@baraju_SuperHit) February 1, 2021
Also Read:
జగ్గుభాయ్ సినిమా నుంచి మరో సాంగ్ రివీల్.. ‘హే హుడియా ప్రేమలో పడిపోయా’ అంటూ…