ఆర్ఎక్స్100 హీరో కొత్త చిత్రం టైటిల్ ఎప్పుడంటే..!

‘ఆర్ఎక్స్100’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ తన రెండో సినిమా ‘హిప్పీ’ షూటింగ్ పూర్తి చేశాడు. జూన్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ఈ హీరో తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు అర్జున్‌ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్నట్లు సమాచారం. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా […]

ఆర్ఎక్స్100 హీరో కొత్త చిత్రం టైటిల్ ఎప్పుడంటే..!

Updated on: Apr 25, 2019 | 6:08 PM

‘ఆర్ఎక్స్100’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ తన రెండో సినిమా ‘హిప్పీ’ షూటింగ్ పూర్తి చేశాడు. జూన్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ఈ హీరో తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు అర్జున్‌ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్నట్లు సమాచారం.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం యొక్క  టైటిల్ రేపు మధ్యాన్నం 12:06 గంటలకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని స్వయంగా హీరో కార్తికేయ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు.