Allu Arjun’s ‘Pushpa’ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్‌లోనూ బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 13 ఆగస్టు 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే తాజాగా పుష్ప కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి లారీ డ్రైవర్ పాత్ర కాగా మరొకటి బిజినెస్ మ్యాన్ పాత్ర అని అంటున్నారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ కాలికి ఐదువేళ్ళు కనిపిస్తున్నాయి. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ కాలికి ఆరు వేళ్ళు కనిపించాయి. దాంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని కొందరంటుంటే.. మరికొందరు రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడని అంటున్నారు. మొత్తానికి బన్నీ ఎలా కనిపిస్తాడన్నది సుక్కు అండ్ టీమే చెప్పాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Monal Gajjar : ఫుల్ బిజీగా మారిన బిగ్ బాస్4 బ్యూటీ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్న గుజరాతీ ముద్దుగుమ్మ..