Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌..

|

Sep 14, 2022 | 3:19 PM

మనీలాండరింగ్‌ కేసులో మరోసారి ఈడీ విచారణకు బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez) హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను విచారిస్తున్నారు.

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌..
Jacqueline Fernandez
Follow us on

Rs 200 crore money laundering case: మనీలాండరింగ్‌ కేసులో మరోసారి ఈడీ విచారణకు బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez) హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను విచారిస్తున్నారు. మాయగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌ను పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా ఈడీ విచారిస్తోంది. జాక్వెలిన్‌ను, పింకీ ఇరానీని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉదయం11.30 గంటలకు ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి వచ్చారు. సుకేష్‌తో ఆమెకు ఉన్న సంబంధం, అతని నుంచి ఆమెకు లభించిన బహుమతుల గురించి ఢిల్లీ పోలీసులు సుదీర్ఘమైన ప్రశ్నల సంధిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.200 కోట్ల బెదిరింపు కేసులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో దాఖ‌లు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ న‌మోదు చేసిన స‌ప్లిమెంట‌రీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేర‌స్థుడు సుకేశ్ చంద్ర శేఖ‌ర్ నుంచి జాక్వెలిన్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌నీలాడ‌రింగ్ కేసులో జాక్వెలిన్‌ను గతంలో కూడా ఈడీ విచారించింది. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి న‌టి జాక్వెలిన్ ఖ‌రీదైన పలు ఖరీదైన వ‌స్తువుల్ని తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కాగా.. ఈడీ‌ అటాచ్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ అంతకుముందు తెలిపారు. రూ. 200 కోట్ల కుంభకోణంలో మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఇచ్చిన బహుమతులు కాదంటూ స్పష్టంచేశారు. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్‌ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలంటూ జాక్వెలిన్ ఈడీని కోరారు. మాయగాడు సుకేశ్‌తో పరిచయం లేనప్పుడే, ఎఫ్‌డీలపై పన్ను చెల్లించినట్లు అంతకుముందు ఈడీకి ఇచ్చిన సమాధానంలో జాక్వెలిన్‌ తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.