RRR Movie: మంచి మనసు చాటుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. అనాథ పిల్లల కోసం స్పెషల్‌ షో..

|

Apr 09, 2022 | 3:10 PM

RRR  Special Show:  మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించారు.

RRR Movie: మంచి మనసు చాటుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. అనాథ పిల్లల కోసం స్పెషల్‌ షో..
Rrr
Follow us on

RRR  Special Show:  మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించారు. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలో చెర్రీ, ఎన్టీఆర్‌ల నటన అదిరిపోయిందని, రాజమౌళి టేకింగ్‌ అద్భుతంగా ఉందంటున్నారు. ఈనేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం మంచి మనసు చాటుకుంది. అనాథ పిల్లల కోసం నేడు (ఏప్రిల్‌9) ప్రసాద్‌ ల్యాబ్‌లో స్పెషల్‌ షోను ఏర్పాటుచేయనుంది. దర్శక ధీరుడు రాజమౌళితో సహా పలువురు యూనిట్‌ సభ్యులు ఈ స్పెషల్‌ స్ర్కీనింగ్‌కు హాజరుకానున్నారు.

కాగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్ హీరోయిన్‌ ఓలివియా మోరీస్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం హిందీ వెర్షన్‌ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.200 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. తద్వారా కొవిడ్‌ తర్వాత విడుదలైన చిత్రాల్లో రూ.200 కోట్ల మార్కుకు చేరుకున్న రెండో చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిలిచింది.

Also Read: ”గవర్నర్లను ఎలా గౌరవించాలో మాకు తెలుసు.. వాస్తవానికి ఆ వ్యవస్థ అవసరమే లేదు”.. మంత్రి తలసాని షాకింగ్ కామెంట్స్

Bhainsa Tension: శోభాయాత్రకు షరతులతో కూడిన అనుమతి.. నివురుగప్పిన నిప్పులా భైంసా.. నగరంలో పోలీసుల భారీ కవాతు

Driverless Trucks: డ్రైవర్ లేకుండానే నడిచే ట్రక్కులు.. అమెరికా కంపెనీ అద్భుత ఆవిష్కరణ..